ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : మండల కేంద్రమైన కలకడ ఎస్సై బదిలీపై వెళ్లడంతో, నూతన ఎస్సైగా రామాంజులు బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై రామకృష్ణారెడ్డి కర్నూల్ రేంజ్ కి విఆర్ కు బదిలీ కావడంతో, యాదమరిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ ఉండిన రామాంజులు కలకడ ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై రామాంజులు మాట్లాడుతూ … లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘ ఉంచడం జరుగుతుందని, చోరీల నియంత్రణకు, జూదం, పేకాట, కోడి పందాలు తదితరాల నియంత్రణపై ఉక్కుపాదం మోపిన జరుగుతుందని తెలిపారు. నాటు సారా తయారీ, అమ్మకాలు జరగకుండా గట్టి జాగ్రత్తలు వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో సిబ్బంది తనకు చేదోడు వాదోడుగా ఉండి సహకరించాలని ఆయన కోరారు.
