జంప్‌రోప్‌లో రాణించిన రామిరెడ్డి ప్రసన్న ఆర్థిక చేయూతనిస్తే మరింత ప్రతిభ

ప్రజాశక్తి – వేంపల్లె మండలంలోని ముత్తుకూరు గ్రామ రైతు కుటుంబానికి చెందిన రామిరెడ్డి ప్రసన్న జంప్‌రోప్‌లో ప్రతిభ చూపి అందరి ప్రశంసలు పొందింది. రామిరెడ్డి చంద్రఓబుల్‌రెడ్డి, రామలక్షుమ్మ కుమార్తె రామిరెడ్డి ప్రసన్న విద్యార్థి దశ నుండి క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేది. ప్రసన్న క్రీడా ప్రతిభను గుర్తించిన సింహా ద్రిపురం మండలం కస్తూరిబా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసన్నను ప్రోత్సాహించారు. క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి జంప్‌రోప్‌లో ప్రతిభ కనబరుస్తూ జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొం దింది. పలుసార్లు జరిగిన పోటీ ల్లో విజయం సాధిస్తూ వస్తోంది. అయితే విద్యార్థి ప్రసన్నకు ప్రోత్సాహం లేకపోవడంతోపాటు ఆర్థికంగా వెనుకబడి ఉంది. ఇది ఆమె మరింత క్రీడల్లో రాణించేందుకు ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా ప్రోత్సహిస్తే ప్రసన్న మరిన్ని దేశానికి బహుమతులు తెచ్చే అవకాశం ఉంది. పేద రైతు కుటుంబం కావడంతోనే ప్రోత్సాహం చాలా తక్కువగా ఉందని.. ఎవ రైనా దాతలు ప్రోత్సహిస్తే దేశానికి కూడా మంచి పేరు తెస్తుందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీపడి తన సత్తా చాటి మొదటి స్థానంలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఆమె మరింత రాణించాలంటే ఆర్థికపరమైన ప్రోత్సాహం కల్పిం చాలని, దాతలు ఇలాంటి క్రీడాకారులకు చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.

➡️