విఆర్.పురం (అల్లూరి) : మండలంలోని రేఖపల్లి పంచాయతీలో గల బొప్పెన భీమయ్య పార్టీ కార్యాలయం నందు సోమవారం రోజున పూనం. ప్రదీప్ కుమార్ అధ్యక్షతన మండల శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన. కిరణ్ పాల్గొని వారు మాట్లాడుతూ పెద్దమటపల్లి పంచాయతీలో గల మెట్టగూడెం గ్రామంలో23న జరిగే మండల మహాసభ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక శాఖ కార్యదర్శులు నాయకులు పని చేయాలని మండల మహాసభను విజయవంతం చేయాలని వారికి పిలుపునిచ్చారు . ఈ సమావేశంలో పాల్గొన్నవారు మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, ఎంపీపీ కారం లక్ష్మి, మండల నాయకులు పంకు సత్తిబాబు, పులి. సంతోష్ కుమార్, కుంజ. నాగిరెడ్డి, కారం సుందరయ్య, వడ్లాది. రమేష్, పోడియం శ్రీరామ్మూర్తి, చిక్కాల రామారావు, సోడి, మల్లయ్య, తోడం.రాజు గొంది. దారయ్య, పండ, వెంకటేశ్వర్లు పులి బుజ్జి, వాళ్ల. కృష్ణారెడ్డి ఖాదర్, కొండారెడ్డి, కారం సత్తిబాబు. తుర్రం బాబురావు, ప్రజా ప్రతినిధులు రామవరం సర్పంచ్ కారం బుచ్చమ్మ, పెద్ద మట్టపల్లి సర్పంచ్ వేటి. లక్ష్మి, కాంతారావు, వేటగాని సూరి, ముసలి సత్యనారాయణ, నాగరాజు, ఆసు లక్ష్మయ్య, తాత బాబు రెడ్డ వీర్ల నాగేశ్వరావు, నాయకులు శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మండల మహాసభ విజయవంతం చేయండి : రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్
