హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీలు

Jun 11,2024 22:48
ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న డాక్టర్‌ ఖాదర్‌వలీ

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న డాక్టర్‌ ఖాదర్‌వలీ
హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక వైద్యశాలను జిల్లా క్షయ, కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్‌ ఖాదర్‌వలీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న అడల్ట్‌ బీసీజీ టీకాకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు సూచనలు బాధ్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఖాదర్‌వలీ మాట్లాడుతూ క్షయవ్యాధిని నివారించేందుకు అడల్ట్‌ బిసిజి టీకాలను ప్రజలు వేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారిలో ఇంతకుముందు టిబి వచ్చినవాళ్లు, షుగర్‌ వ్యాధిగ్రస్తులు, పొగాకు అలవాటు ఉన్నవారు 60యేళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈటె కానీ వేసుకోవచ్చని తెలిపారు. ల్యాబ్‌లో జరుగుతున్న పరీక్షలు మందుల పంపిణీ వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించమని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ జిహారిక, డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, డాక్టర్‌ రాజశేఖర్‌, సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️