గ్రామాల్లో యథేచ్చగా కోడి పందాలు

ప్రజాశక్తి-ముమ్మిడివరం (కోనసీమ) : సంక్రాంతి సంబరాల్లో జరిగే కోడి పందాలను ఎట్టి పరిస్థితుల్లోను అడ్డుకొని తీరుతామని ఖాకీలు.. మరో పక్క నిర్వహించి తీరుతామని పందెం రాయుళ్ళు …. పంతంలో చివరికి కోడె గెలిచింది. సంక్రాంతి పండగ మొదటి రోజు భోగి పండగ వేళ సోమవారం మండలంలోను, నగర పంచాయతి పరిధిలోను పలు గ్రామాల్లో టిడిపి, జనసేన, బిజెపి ల కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు ఆధ్వర్యంలో నగర పంచాయతి పరిధిలోని రాజుపాలెంలో టిడిపి నాయకుడు శ్రీనివాస రాజు ఏర్పాటు చేసిన బరిలో టిడిపి సీనియర్‌ నాయకులు గోలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌ లు కోడి పందాలను ప్రారంభించారు. గేదెల్లంక గ్రామంలో జనసేన నాయకుడు గుద్దటిజమ్మి, అన్నంపల్లి గ్రామంలో టిడిపి నాయకుడు అర్ధాని శ్రీనివాసరావు, అలాగే కొత్తలంక, అయినాపురం, ఠానేలంక లంక ఆఫ్‌ ఠానేలంక తదితర గ్రామాల్లో బరులను ఏర్పాటు చేసి కోడి పందాలు గుండాట, పేకాటలు యథేచ్ఛగా నిర్వహించారు. వీటిలో రాజుపాలెం బరికి రూ.10 లక్షలు, గేదెలంక బరికి రూ.8 లక్షలు, అన్నంపల్లి బరికి రూ.6 నుండి 7 లక్షల వరకు ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. మిగిలిన బరులకు 3 నుండి 5 లక్షలు వరకు ఒప్పందాలు కుదిరినట్లు వినికిడి, నిన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం అంటూ భారీ ప్రచారం చేసిన ఖాకీలు, రాజకీయ ఒత్తిళ్ళ నేపథ్యంలో కోడి పందాలు, గుండాట, పేకాటా శిబిరాల వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం పై పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

➡️