ఒంగోలు (ప్రకాశం) : ఎథ్మోయిడ్ సైనస్ మ్యూకోసిల్ వ్యాధికి కిమ్స్ హాస్పిటల్స్ లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఘనత సాధించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ … 55 సవత్సరాలున్న ఓ మహిల కుడి కనుగుడ్డు పక్కకి జరిగిపోయి వాపుకి గురై విపరీతంగా బాధపడుతూ కిమ్స్ హాస్పటల్ కి (ఓ.పి) కీ వచ్చిందన్నారు. ఇ.ఎన్.టి సర్జన్ డాక్టర్ కొనగళ్ల కార్తీక్ అన్ని పరీక్షలు చేసి ఆమె ఎథ్మోయిడ్ సైనస్ మ్యూకోసిల్ (కణితి) అను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారని తెలిపారు. మ్యూకోసీల్స్ సాధారణమైనప్పటికీ, ఇవి కన్నులోకి విస్తరించి దఅష్టి కోల్పోయే ప్రమాదం చాలా అరుదుగా ఉంటుందని, ఇలాంటి వ్యాధికి మేజర్ కోతతో కూడిన సర్జరీ అవసరం కానీ డాక్టర్ కార్తీక్ అత్యాధునికమైన ఎండోస్కోపీ పరికరంతో ఎలాంటి కోత లేకుండా ఆమెకు చికిత్స నిర్వహించారని చెప్పారు. ఓపెన్ సర్జరీ చేసినట్లుయితే కన్ను విడిపోయి, నరాలు తెగిపోయి కనుచూపు పోయే ప్రమాదం ఉందని పేషెంట్‌కు డాక్టర్ తెలిపారు. పేషెంట్ అంగీకారాలతో ఈ అరుదైన సర్జరీ డాక్టర్ కార్తీక్ సమర్ధవంతంగా నిర్వహించారని తెలిపారు. ఇలాంటి చికిత్స మెట్రోపాలిటన్ నగరాల్లోని ఆసుపత్రుల్లో మాత్రమే చేయగలరని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి శ్రీహరి రెడ్డి తెలియజేసారు. ఇలాంటి చికిత్స ఒంగోలు కిమ్స్ హాస్పిటల్స్ లో చేసినందుకు గర్వకారణంగా ఉందని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా అయినందుకు డాక్టర్ కార్తీక్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చికిత్సకు సహకరించిన వైద్య బృందానికి ఆయన అభినందనలు తెలియజేసారు. ఇలాంటి అరుదైన వైద్య సేవలు అందించడంలో కిమ్స్ హాస్పిటల్స్ ఎప్పుడూ ముందు ఉంటాయని ఇ.డి. టి. గిరినాయుడు అభినందించారు. కిమ్స్ హాస్పటల్స్ సి.ఓ.ఓ. కె. అంకిరెడ్డి సర్జరీ ని విజయవంతం చేసిన వైద్య బఅందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఎథ్మోయిడ్ సైనస్ మ్యూకోసిల్ వ్యాధికి కిమ్స్ హాస్పిటల్స్ లో అరుదైన శస్త్ర చికిత్స
