‘అపోలో’లో అరుదైన శస్త్ర చికిత్స

Jun 11,2024 18:55
'అపోలో'లో అరుదైన శస్త్ర చికిత్స

వివరాలు వెల్లడిస్తున్న వైద్యులు
‘అపోలో’లో అరుదైన శస్త్ర చికిత్స
ప్రజాశక్తి-నెల్లూరుక్లిష్టతరమైన ఆపరేషన్లకు నెల్లూరు అపోలో హాస్పిటల్‌ కేరాఫ్‌ గా నిలుస్తోంది. ఇతర దేశాలకు సైతం ధీటుగా అధునాతన సేవలందించడంలోఅపోలో ప్రత్యేకతను చాటుకుంటుంది. మంగళవారం అపోలో ఆసుపత్రి లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశం లో ఆసుపత్రి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ శ్రీరామ్‌ సతీష్‌, ప్రముఖ కార్దియాలాజిస్ట్‌ డాక్టర్‌ చిర్రా భక్తవత్సల రెడ్డి లు హాజరై చికిత్స విధానాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అపోలో వైద్యులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సింగరాయకొండ కు చెందిన నాగేశ్వరరావు(70) అనే వ్యక్తి గత కొంత కాలంగా ఆయాసం, దగ్గు, చాతి నొప్పితో బాధపడుతు పలు ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్న ఫలితం కనపడలేదన్నారు. ఈ క్రమంలో ఆ పేషంట్‌ వైద్య చికిత్సల నిమిత్తం నెల్లూరు అపోలోకు వచ్చారన్నారు.అత్యవసర విభాగంలోని వైద్యులు పరీక్షలు చేయగా ఆక్సిజన్‌ పల్స్‌ శాతం 80, హార్ట్‌ రేట్‌ 130, కిడ్నీ ఫంక్షన్‌ 2.3 గా గుర్తించారన్నారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్టు చిర్రా భక్తవత్సలరెడ్డి సూచనల మేరకు పూర్తి స్థాయిలో పరీక్షించగా అతని గుండెలో ఉండే( కవాటము) మూసుకొని ఉండటాన్ని గుర్తించా మన్నారు. వైద్యులు, టెక్నిషియన్లు నిర్వహించిన పరీక్షల్లో గుండెకు రక్తం సరఫరా చేసే కవాటము వాస్తవానికి ఐదు సెంటీమీటర్లు ఉండాల్సి ఉండగా కేవలం.7 సెంటీమీటర్లు కుంచుకుపోయిందన్నారు. ఈ కారణంగా గుండె బాగా బలహీన పడి ఉండటాన్ని గుర్తించి పేషెంట్‌ ను వారం రోజులు పాటు ఐసీయూ లో ఉంచడం చికిత్సలు అందజేశామన్నారు. బాధితుడికిి ఆపరేషన్‌ ముప్పై శాతం రిస్క్‌ తో కూడిన విషయమని, ప్రాణా పాయంతో కూడిన ఆపరేషన్‌ కావడంతో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి వారి అంగీకారంతో బాధితుడు నాగేశ్వరరావుకు సరికొత్త విధానం ద్వారా ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ ఆపరేషన్‌ కాలు నరం ద్వారా వాలును గుండె కవాటము వద్ద అమర్చామన్నారు. పేషంట్‌ గుండెను పేస్‌ మేకర్‌ ద్వారా నాలుగు సెకండ్లు పాటు గుండె పనిచేయకుండా ఆపి కాలు నుంచి వాలును పొజిషన్‌ లోకి తీసుకొచ్చామన్నారు. గత 15 సంవత్సరాలుగా యూఎస్‌, యూరప్‌ దేశాలలో వివిధ పద్ధతుల ద్వారా ఆపరేషన్‌ డాక్టర్లు చేస్తున్నారన్నారు. గత పది ఏళ్ల నుంచి ఇండియాలో కేవలం మహానగరాలలో మాత్రమే ఈ ఆపరేషన్లు పరిమితం అయ్యాయన్నారు. నెల్లూరు అపోలో హాస్పిటల్‌ లో ఇది రెండవదన్నారు. మొట్టమొదటి సారి కావలికి చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ల క్రితం ఆపరేషన్‌ చేయగా, రెండవది నాగేశ్వరావుకు చేసినట్లు తెలిపారు. నిజానికి ఈ ఆపరేషన్‌ ఖర్చు తో కూడినది అయినప్పటికీ, దీనిపట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి ఎమర్జెన్సీ మరియు ఐసీయూ హెడ్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, కార్దియో తోరాసిక్‌ సర్జన్లు డాక్టర్‌ విజ్ఞ చరణ్‌, డాక్టర్‌ మధు, కార్దియాలాజిస్టులు డాక్టర్‌ షర్మిలి, డాక్టర్‌ నాగభూషణం, యూనిట్‌ హెడ్‌ బాలరాజు పాల్గొన్నారు.

➡️