నగర పంచాయతీ కౌన్సిల్‌లో రసాభాస

ప్రజాశక్తి-గిద్దలూరు: స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్‌ సాధారణ సమావేశం వాగ్వాదాలు, గందరగోళం నడుమ రసాభాసగా జరిగింది. బుధవారం నగర పంచా యతీ కార్యాలయంలో చైర్మన్‌ పాముల వెంకట సుబ్బయ్య అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచా యతీ వైస్‌చైర్మన్‌ ఆర్‌డి రామకష్ణ వాగ్వాదానికి దిగారు. అజెండాలోని 50వ అంశాన్ని తప్పుప డుతూ ఆయన మాట్లాడారు. అప్కాస్‌ విధానం ద్వారా నియమింపబడిన నలుగురు పిహెచ్‌, నాన్‌ పిహెచ్‌ సిబ్బంది మరణించగా, 12 మంది స్వచ్చందంగా తప్పుకున్నారని, మొత్తంగా 16 ఖాళీలు ఏర్పడ్డాయని వారిని అప్కాస్‌ నుండి తొలగించి కొత్తవారిని నియమిం చాలనే అంశం ప్రస్తావించగానే ఆయన మండిపడ్డారు. ఇది కేవలం రాజకీయ కక్ష్యతోనే తొలగిస్తున్నారని ఇందులో అప్కాస్‌ సిబ్బంది స్వచ్ఛందంగా ఎవరు మాను కోలేదన్నారు. ఒక్కసారిగా 12 మందిని తొలగించడం సరికాదన్నారు. దీనికి సమాధానంగా 2వ వార్డు కౌన్సిలర్‌ బూనెబోయిన చంద్రశేఖర్‌ యాదవ్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఏ పద్దతిలో తొలగించారో, అదే విధంగా ఇప్పుడు మేము తొలగించాల్సి వచ్చిందన్నారు. ఒకరికొరకు మాటల తూటాలు పేలుస్తూ కౌన్సిల్‌ సమావేశాన్ని ముగించారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట దాసు, కౌన్సిల్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

➡️