ప్రజాశక్తి- ఇంకొల్లు : ప్రభుత్వం, ఉన్నతాధి కారులు, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి నల్లబర్లీ పొగాకును కొన ుగోలు చేయకుండా ఇలాగే తాత్సారం చేస్తే ఈ నెల 15న రాస్తారోకో చేపట్టనున్నట్లు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందిమళ్ళ రామకోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, జి. మల్లారెడ్డి తెలిపారు. ఇంకొల్లులోని మాదాల అంజయ్య భవనంలో నల్లబర్లీ పొగాకు కొనుగోలుపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయక పోతే 15న రాస్తారోకో నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మండల పరిధిలోని కొనికి, కట్టావారిపాలెం, పూసపాడు అడ్డరోడ్డు వద్ద రాస్తారోకోలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
