రోడ్డు పనులు చేపట్టాలని రాస్తారోకో

Feb 1,2025 21:37

ప్రజాశక్తి-వేపాడ :  ఆతవ గ్రామానికి రహదారి పనులు ప్రారంభించాలని రాళ్లు తేలిన రహదారిపై ఆ గ్రామస్తులు శనివారం రాస్తారోకో చేపట్టారు. రోడ్డు పనులు చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు చేపడుతున్న నిరసన ఆరో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు చల్ల జగన్‌ మాట్లాడుతూ రాళ్లు తేలిన రహదారితో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో హామీనిచ్చిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి రోడ్డు సమస్య పట్టడం లేదని విమర్శించారు. వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆతవ గ్రామ నాయకులు కెర్రు దేముడు, ఆతవ నాగరాజు, డప్పు రాజు, ఆతవ సింహాచలం, జి.అవతారం, ఎల్‌.కోటేశ్వరరావు, జి.సాంబమూర్తి, మహేశ్వరరావు, బంగారయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️