రతన్‌ టాటా మృతి దేశానికి తీరని లోటు ‘మండిపల్లి’

ప్రజాశక్తి-రాయచోటి ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా మతి దేవానికి తీరని లోటని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్ర సాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రతన్‌ టాటా వ్యాపార రంగంలో గొప్ప పేరు పొందిన వ్యక్తిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రస్తుత సమాజంలో యువత రతన్‌ టాటా ను ఆదర్శంగా తీసుకుని వ్యాపార రంగంలో మరింత అభివద్ధి చెందాలన్నారు. ఆయన మతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. రాయచోటి టౌన్‌ : రతన్‌ టాటా మతి దేశానికి తీరని లోటని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రతన్‌ టాటా మతితో దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిం దన్నారు. దేశం గర్వించే వ్యాపార శిఖరం, గొప్ప మేధావిగా ఎన్నో కొత్త ఆవిష్కరణలకు సష్టికర్తగా, కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించ డమే కాకుండా వారి సజనాత్మకతను వెలికి తీసిన గొప్ప పారిశ్రామిక వేత్త అని కొనియాడారు. మదనపల్లె అర్బన్‌: మదనపల్లిలోని నిమ్మనపల్లి సర్కిల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మతికి టిటిపి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్‌జె వెంకటేశ్‌, సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు సంతాపం తెలిపారు. లోకేశ్‌ యువసేన ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీలేరు: రతన్‌ టాటా మతి ఉద్దేశానికి తీరని లోటని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో గాంధీ విగ్రహం వద్ద రతన్‌ టాటా చిత్రపటానికి పూలమాల వేసి క్రొవ్వత్తులత్రో ఘన నివాళులర్పించారు. ఈ సందఠంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉప్పు మొదలు విమానయాన రంగం వరకు భారతదేశ అనువణువులోనూ రతన్‌ టాటా ఉంటారన్నారు. ప్రముఖ పారిశ్రా మికవేత్త, టాటా సన్స్‌ గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌, పద్మ విభూషణ్‌ రతన్‌ టాటా మ తి భారతదేశానికి తీరని లోటని, దేశం గొప్ప మానవతవాదిని కోల్పోయిందన్నారు. భారత పారిశ్రామిక రంగానికే కాకుండా ఆయన ప్రపంచ పారిశ్రామిక రంగానికి కూడా ఎన్నో సేవలు అందించారని వారు కొనియాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తుమ్మల ధరణ్‌ కుమార్‌, అమత్‌ తేజ, ఇంతియాజ్‌, టిఎల్‌ వెంకటేష్‌, పాలకుంట శ్రీనివాసులు, సంపత్‌, బద్దె భానుప్రకాష్‌, జివియస్‌ సుబ్రమణ్యం, డాక్టర్‌ రఘునాథ, చీకటిపల్లి విశ్వకాంత్‌ బాబు, బెల్లం పురుషోత్తం పాల్గొన్నారు.

➡️