పోలింగ్‌ శాతం తగ్గించేందుకే వైసిపి దాడులు : కన్నా

May 15,2024 00:38

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఓటమి భయంతో ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని తగ్గించడానికే వైసిపి నాయకులు అరాచకాలు, అడ్డంకులు సృష్టించారని ఎన్‌డిఎ కూటమి తరుపున సత్తెనపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైసిపి నాయకులు దగ్గరుండి రౌడీ మూకలతో రిగ్గింగ్‌ చేయించారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ముందు రోజే దాడులు చేయడానికి వైసిపి నాయకులు రాళ్లు కర్రలు సమకూర్చుకున్నారుని చెప్పారు. అల్లరి మూకలు గంజాయి, మద్యం సేవించి టిడిపి కార్యకర్తలపై తెగబడ్డారని అన్నారు. అరాచకాలను కూటమి పార్టీల కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని పోలింగ్‌ శాతం పెరిగేందుకు దోహద పడ్డారని అన్నారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి యెలినేడి రామస్వామి, ముప్పాళ్ల మండల అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు, సత్తెనపల్లి మండల అధ్యక్షులు ఆళ్ల అమరేశ్వరరావు పాల్గొన్నారు

➡️