రేషన్‌ బియ్యం పట్టివేత

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణంలోని రింగ్‌ రోడ్డు సమీపంలో ఆంధ్రరత్న రైస్‌ అండ్‌ ఫ్లోర్‌ మిల్‌ వద్ద పిడిఎస్‌ బియ్యం అమ్ముతున్నారన్న సమాచారంతో సీఐ మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఎస్సై రాజశేఖర్‌, సిబ్బంది దాడి చేశారు. రేషన్‌ బియ్యం అమ్ముతున్న రైస్‌ మిల్‌ ఓనర్‌ శ్రీకాకుళం రామకష్ణ, గుంటూరు పెదపలకలూరుకు చెందిన కస్తూరి సాయి దిలీప్‌, సింగరాయకొండకు చెందిన లారీ డ్రైవర్‌ దాసరి బ్రహ్మయ్యలను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 16 క్వింటాళ్ల పిడిఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేశామన్నారు. రేషన్‌ బియ్యాఇన్న తరలిస్తున్న లారీని సీజ్‌ చేసినట్లు సిఐ మల్లికార్జున రావు తెలిపారు.

➡️