అందరికీ రేషన్‌ అందించాలి

ప్రజాశక్తి- గిద్దలూరు రూరల్‌: రేషన్‌ సరుకులు కార్డుదారులు అందరికీ అందించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ అనిల్‌ కుమార్‌ రేషన్‌ డీలర్లకు, రేషన్‌ వాహనదారులకు సూచించారు. గిద్దలూరు, పరిసర గ్రామాల్లో రేషన్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోదారులకు అందుబాటులో దుకాణాలను నిత్యం తెరిచి ఉంచాలని, తూకంలో తేడాలు లేకుండా సరుకులు ఇవ్వాలని సూచించారు. బియ్యం పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడితే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు డీలర్‌ వెళ్లి తూకం వేసుకొని సరుకులు తెచ్చుకోవాలని కోరారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️