కెజిబివిలో 12మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

Nov 28,2024 20:34

 ప్రజాశక్తి-గజపతినగరం : మండలంలోని మరుపల్లిలో గల కెజిబివి పాఠశాలలో బుధవారం రాత్రి 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరచిన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు అక్కడ పనిచేస్తున్న ఎఎన్‌ఎంకు తెలియజేసినా పట్టించుకోలేదని తెలిసింది. చివరకు ఎస్‌ఒ స్పందించి పక్కనే ఉన్న పిహెచ్‌సికి పంపించి వారందరికీ గురువారం ఉదయం టిటి ఇంజక్షన్లు చేయించారు. గతంలో కూడా విద్యార్థినులను వివిధ రకాల కీటకాలు కరిచిన సంఘటనలు ఉన్నాయి. మరోవైపు పాఠశాలలోని డార్మిటరీలలో లైట్లు లేకపోవడం, గదుల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ ఘటనతో పక్కనే ఉన్న మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు.

➡️