ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా సిహెచ్.విద్యాసాగర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో గల గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే యువత గంజాయి మత్తు బారినపడి చెడు వ్యసనాలకు బానిసవుతున్నారన్నారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలు సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అలాగే గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపనున్నట్లు ఆయన హెచ్చరించారు. దీంతో ఆయనకు ఆలమూరు ఎస్సై ఎం.అశోక్, పోలీస్ సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
