రాయదుర్గం (అనంతపురం) : మంగళవారం జరిగిన రాయదుర్గం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడిగా వేడిగా కొనసాగింది. కోరం లేకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని పల్లెపల్లి, వడ్రవన్నూరు సర్పంచ్లు రాజు, అరుణ్ ఎంపీడీవో కొండన్నను ప్రశ్నించారు. ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరైతే సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ నేలపై బైఠాయించారు. కనీస సభ్యులు సమావేశానికి హాజరైన తర్వాతనే నిబంధనలు మేరకు సమావేశాన్ని ఆలస్యంగా మొదలుపెట్టినట్లు ఎంపీడీవో తెలిపారు. ఎంపీపీ విద్యావతి అధ్యక్షతన రాయదుర్గం మండల పరిషత్ సమావేశం మీటింగ్ హాల్లో జరిగింది. వడ్రవన్నూరు సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో 7 లక్షల రూపాయల పనులు జరిగినప్పటికీ నాలుగు నెలలు గా వస్తున్నప్పటికీ బిల్లులు ఎందుకు చెల్లించలేదని ఎంపీడీవోను నిలదీశారు. అధికారుల తప్పుకు తాము బలి కావాలని ప్రశ్నించారు. ఇందుకు ఎంపీడీవో కొండన్న, ఎంఈఓ 2 వెంకట రమేష్ మాట్లాడుతూ సర్వ శిక్ష అభియాన్ పథకం కింద వడ్రవన్నూరు గ్రామంలో నిర్మించిన పాఠశాలకు సంబంధించిన నిధులు ఆన్లైన్ లో నమోదు చేయునప్పుడు పొరపాటున మరొక ఖాతాకు జమ అయినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారుల దఅష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ శాఖ పరిధిలో జరుగుతున్న అభివఅద్ధి పనులు, అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను సమావేశంలో సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
