ప్రజాశక్తి 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్ డి టి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్

Dec 27,2024 18:19 #antapuram

ప్రజాశక్తి – అనంతపురం సిటీ : ప్రజాశక్తి 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ ఆమె కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజాశక్తి మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా క్యాలెండర్ ను రూపొందించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ప్రజాశక్తి ఆవిష్కరణలు ప్రజలకు చైతన్య పూరితంగా, మార్గదర్శకంగాను ఉంటాయని అన్నారు. కొత్త ఆవిష్కరణలకు ప్రజాశక్తి వేదికగా ఉండటం సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేసే సిబ్బందిని తయారు చేయడం గొప్ప పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సిబ్బంది రవిచంద్ర, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

➡️