ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో,పధోన్నతలు,బదిలీలు, షెడ్యూల్లో వున్న లోపాలు ను సరి చేయాలని, ఎస్ టి యు విజయనగరము జిల్లా శాఖ, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ..కె.విజయ భాస్కర్, విశాఖపట్నం వారికి,మేమురాండం ఇవ్వడం జరిగిందిసీనియారిటీ జాబితాలను మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ ఆధారంగచేయాలనీ, తరగతలు,మ్యాపింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్.ఎం.సి కమిటీ అభిప్రాయాలను పరిగణలోనికి తీసి కోవాలనీ , ఇంకా బకాయ పడి వున్న 50%, పాఠశాల నిర్వహణ నిధులు చెల్లించాలని, గిరి శిఖర ప్రాంతాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు స్పెషల్ పోయింట్స్ ఇవ్వాలనీ, పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు(సరెండర్ లీవ్ బకాయిలు, పి.యఫ్ లు,ఎపి జినెల్ ఐబకాయిలు, చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమము లో విజయనగరం జిల్లా విద్యా శాఖాధికారి యు.మాణిక్యాల నాయుడు కి కూడా వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, కె.జోగారావు, జిల్లా ప్రధానకార్యదర్శి చిప్పాడ.సూరిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం. మురళీ, జిల్లా ఉపాధ్యక్షులు టి.నాగేశ్వరరావు,ఎస్. బంగారయ్య,జిల్లా కార్యదర్శి లు,.పి.రాంబాబు,జి ఎస్ ఎ.నాయుడు ,పి. రమణ.పాల్గొన్నారు.
