సెకండ్‌ ఎఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయండి

పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం-2 బ్యాచ్‌ వారి యొక్క క్రమబద్ధీ కరణ విషయంపై వారి ఎదు ర్కొంటున్న సమస్యలపై పరి ష్కారం కోసం ఆదివారం నరసరావుపేట ప్రకాష్‌ నగర్‌ లోని శ్రీ తిలక్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమా వేశానికి సంఘ అధ్యక్షులు స్వర్ణ చిన రామిరెడ్డి ఎఎన్‌ఎం-2 సంఘ కన్వీనర్‌ లింగమ్మ పాల్గొన్నారు. ఎఎన్‌ఎం 2 లు 2007,2008, 2009, 2010వ సంవత్స రంలో నియామక ఉత్తర్వులు పొంది పి హెచ్‌ సి , సబ్‌ సెంటర్‌లో అప్పటినుండి వారు కన్సాలిడేటెడ్‌ జీతం మీద పనిచేస్తున్నా రన్నారు. రూ 21 వేలు వేతనంతో ప్రయాణ ఖర్చులు క్లీనిక్‌ మెయింటినెన్స్‌ ఖర్చులు భరి స్తున్నా రన్నారు.17 ఏళ్ళ నుండి పని చేస్తూ రెగ్యు లర్‌ కోసం ఎదురు చూస్తూన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1420 మంది ఉండగా పల్నాడు జిల్లాలో 42మంది ఉన్నారని, వారికి ఏ విధమైన రవాణా భత్యాలు, డి.ఎ ఇతర అల వెన్స్‌లు మినిమం టైం స్కేల్‌ ,ఇంక్రిమెంట్లు , సంపాదిత సెలవులు ఏమీ లేకుండా ఏళ్ల తరబడి పని చేస్తున్నారన్నారు. రిటైర్మెంట్‌ కు దగ్గరగా ఉండి చాలీచాలని జీతంతో వారు బతకడం కష్టంగా ఉంటుందన్నారు. కరోనా సమయంలో అనేక మంది కరోనా బారిన పడి మరణించారని కొంతమంది వైద్యానికి కూడా డబ్బులు లేక వైద్యం చేయించుకునే స్థోమత లేక మరణించారని మరణించిన వారికి మట్టి ఖర్చులు చెల్లించలేదన్నారు. వారికి డిప్యుటేషన్‌ కింద, వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ కింద 100,200 కిలోమీటర్ల దూరం విధులకు వెళుతున్నా రన్నారు. ఏఎన్‌ఎం-2 లను క్రమ బద్ధీకరణ చేసి మినిమం టైం స్కేల్‌ వర్తింపజ ేయాల న్నారు. ప్రభుత్వం స్పందించి మహిళ ఉద్యో గులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో సంఘ సెక్రటరీ చుక్క వెంకటేశ్వర్లు, బండి సంపూర్ణ ,లింగమ్మ , మణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️