ప్రజాశక్తి-చీపురుపల్లి : వేతన ఒప్పందం అమలు చేయాలని మండలంలోని కర్లాంలో ఉన్న వెంకటరామా పౌల్ట్రీ ముందు బుధవారం కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంబళ్ల గౌరినాయుడు, సీనియర్ నాయకులు జె.విశ్వనాథరాజు ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కార్మికులతో చేసుకున్న వేతన ఒప్పందాన్ని వెంకటరామా పౌల్ట్రీ యాజమాన్యం అమలు చేయక పోవడం విచారకరమన్నారు. ఈ నెల 3న జెసిఎల్ వద్ద జరిగిన చర్చల్లో యాజమాన్యం రూ.250 కంటే పెంచలేమని చెప్పడంతో కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశామన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి వీడి కార్మికులకు నూతన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌చేశారు.