ప్రజాపోరుపై సిపిఎం కరపత్రం విడుదల

ప్రజాశక్తి-పామూరు : నవంబర్‌ 8 నుంచి 15వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కానికై ప్రజాపోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు కరపత్రం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపటంలో విఫలమైందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కులమతాలను రెచ్చగొట్టి అన్నదమ్ములుగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలంపై తీవ్రమైన భారం మోపుతున్నారని ఆరోపించారు. పనులు లేక వలసలు వెళుతున్న యువతకు ఉపాధి చూపటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమాలు ఆగవన్నారు. మండల ప్రజలు ఈ ప్రజాపోరు కార్యక్రమానికి సహకరించాలని సూచించారు. ఈ నెల 15వ తేదీన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కరపత్రం విడుదల కార్యక్రమంలో యాట వీరనారాయణ, సయ్యద్‌ గౌస్‌ బాషా, ఎస్కే ఖాదర్‌బాషా, ఎం రామయ్య, కే శంకర్‌, ఎస్‌కే అల్లాబక్షు పాల్గొన్నారు.

➡️