ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

Dec 11,2024 21:02
ఫొటో : నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న అధికారులు

ఫొటో : నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న అధికారులు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ప్రజాశక్తి-సంగం : తహశీల్దార్‌ కార్యాలయంలో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం తహశీల్దార్‌ సోమ్లా నాయక్‌, నోడల్‌ అధికారి వినరు కుమార్‌ విడుదల చేశారు. ఆరు సాగునీటి సంఘాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ పత్రాలను నోటీస్‌ బోర్డులో అంటించారు. ఆరు సాగునీటి సంఘాలకు సంబంధించి 44 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 14వ తేదీ సాగునీటి సంఘం ఎన్నికలను జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో, సచివాలయాల్లో, గ్రామ పంచాయతీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో నోటిఫికేషన్‌ పత్రాలను పబ్లిష్‌ చేస్తామన్నారు.

➡️