చేతి బోరుకు మరమ్మతులు

May 16,2024 23:18 #Bore well repaits
Bore well repairs

 ప్రజాశక్తి-ఆనందపురం : మండలంలో ఆనందపురం పంచాయతీ పొడుగుపాలెం గ్రామంలో పాడైన బోరుకు గురువారం మరమ్మతులు చేపట్టారు. ‘పాడైన బోరును పట్టించుకోరా?’ శీర్షికన ప్రజాశక్తిలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం పొడుగుపాలెం గ్రామానికి సిబ్బంది చేరుకొని వర్షంలోనే చేతిపంపుకు మరమ్మత్తులు పూర్తిచేశారు. ఈ చేతిపంపును బాగు చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. మరమ్మతులు పూర్తిచేసిన అధికారులకు, ప్రజాశక్తి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు

➡️