రాయపూడి వద్ద ఎన్‌ఆర్‌టి నిర్మాణానికి కేటాయించిన స్థలం
ప్రజాశక్తి – తుళ్లూరు : రాజధాని అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణఖు పభుత్వం నిర్ణయనికొచ్చింది. ఇందులో భాగంగా రాయపూడి వద్ద అధికారులు బుధవారం స్థలాన్ని పరిశీలించారు. రాయపూడి వద్ద ఎన్‌ఆర్‌టి (నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) ఐకాన్ టవర్ నిర్మాణానికి గత టిడిపి ప్రభుత్వం హాయంలో భూమిని కేటాయించింది. 2018 జూన్ 22న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దీనికి శంకుస్థాపన చేశారు. 2019లో వైసిపి అధికారంలోకి రావడంతో ఐకాన్ టవర్ నిర్మాణం ఊసే లేకుండా పోయింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఐకాన్ టవర్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. స్థలాన్ని పరిశీలించారు. సిఆర్‌డిఎ కమిషనర్ కాటంనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పి ఎటివి రవి కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు.