సమస్యల పరిష్కారానికి వినతి

Jun 10,2024 21:46
ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న మున్సిపల్‌ కార్మికులు
సమస్యల పరిష్కారానికి వినతి
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : కావలి మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికుల పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు మున్సిపల్‌ కార్యాలయంలో మేనేజర్‌ షేక్‌ సికిందర్‌కు అర్జీనిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నో సందర్భాల్లో మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినప్పటికీ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని కార్మికులకు జనవరి ఫిబ్రవరి నెలలో హెల్త్‌ అలవెన్స్‌లు, సంక్రాంతి కానుక వెయ్యి రూపాయలు, సమ్మె కాలం జీతం, సుమారు 5నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని అంతేకాకుండా డైలీ కార్మికులకు రెండు నెలల జీతాలు తోపాటు కొబ్బరి నూనె, సబ్బులు, యూనిఫారం, ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని ముఖ్యంగా తక్కువ జీతాలతో పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులను అవుట్సోర్సింగ్‌లో చేర్చుకోవాల్సి ఉన్నప్పటికీ వారి స్థానంలో కొత్తవారిని చేర్చుకోవడం చాలా అన్యాయమన్నారు. కార్మికులు పనుల్లో పుష్కాట్లు లేక పనిముట్లు సక్రమంగా లేక పనుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడం కార్మికుల సమస్యలు పరిష్కరించక పోవడం చాలా దారుణమైన విషయమని తెలిపారు. ఈ విషయాలను కమిషనర్‌ దృష్టికి చాలాసార్లు తీసుకొని పోయామని ఇంతవరకు పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా కార్మికుల అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పరిష్కరించకపోతే త్వరలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి కృష్ణయ్య, యూనియన్‌ నాయకులు తురక సీనయ్య, బిడదల మహేష్‌, ఒంగోలు రమేష్‌ పరుసు జేమ్స్‌, కె.బాబు, వై క్రాంతి కుమార్‌, శివకోటయ్య మహిళా నాయకులు పరుసు చిన్నమ్మ, పల్లిపాటి అనిత, గద్దె రాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️