ప్రజాశక్తి – పెదకూరపాడు : ప్రభుత్వం నుండి తమకు ఆర్థిక పరమైన సహకారం లేకున్నా వేసవి సెలవుల్లో కూడా విద్యాశాఖాధికారులు రకరకాల రిపోర్టుల పేరుతో తమను ఒత్తిడికి, మానసిక వేదనకు గురి చేస్తున్నారని పెదకూరపాడు నియోజకవర్గ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ నోముల కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఎంఇఒ ప్రసాద్‌రావుకు శుక్రవారంవినతి పత్రం ఇచ్చారు. గత విద్యా సంవత్సరం అనుభవాలతో వచ్చే విద్యాసంవత్సరానికి సన్నద్ధమవుతూ, ఉపాధ్యాయులను, విద్యార్థులు, పాఠశాల అవసరాలను సమకూర్చుకొనే ఈ సందర్భంలో వార్షిక అడ్మిషన్ రిపోర్ట్, ఫారం-1లు తక్షణమే సబ్మిట్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదనకు గురయ్యారు. దీనికి తమకు కొంత సమయం కావాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకతీయ ప్రిన్సిపల్ లలితబాబు, సెయింట్ ఆన్స్ హెచ్‌ఎం వేళాంగిని జ్యోతి, వివేకానంద విద్యాసంస్థల ప్రిన్సిపల్ శిరీష , చైతన్య, పాటిబండ్ల స్కూల్స్ యాజమాన్యాలు పాల్గొన్నారు.
