పిఎసిఎస్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా

Jun 10,2024 21:15

ప్రజాశక్తి – పూసపాటిరేగ : పూసపాటిరేగ పిఎసిఎస్‌ చైర్మన్‌ మహంతి లక్ష్మణరావు సోమవారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆయన రాజీనామా పత్రాన్ని స్థానిక పిఎసిఎస్‌ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పిఎసిఎస్‌ చైర్మన్‌గా పదవి ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు రుణపడి ఉంటానన్నారు. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవిని బాధ్యతాయుతంగా నిర్వహిం చానని చెప్పారు. తాను ఎప్పుడూ బొడ్డుకొండతోనే ఉంటానని, వైసిపి బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఆయనతో పాటు బోర్డు సభ్యులు నారాయణ మూర్తి రాజు రాజీనామా చేశారు. వారితో పాటు స్థానిక సర్పంచ్‌ తొంపల సీతారాం తదితరులు ఉన్నారు.

➡️