అపెక్స్‌ పరిశ్రమలో కార్మిక సమస్యలు పరిష్కరించండి : సిఐటియు ఆందోళన

ప్రజాశక్తి – పెద్దాపురం (కాకినాడ) : పెద్దాపురం మండలం వడ్లమూరు రహదారిలోని అపెక్స్‌ రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశ్రమ గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. వేతనాల పెంపుదల కోసం మహిళా కార్మికులు చేస్తున్న ఆందోళనకు సిఐటియు మండల కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అనంతరం ఆర్డిఓ జె సీతారామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ ఈ పరిశ్రమలో మహిళా కార్మికులకు రూ 330 వేతనంగా ఇస్తున్నారన్నారు. దీనిని రూ 400 కు పెంచాలని మహిళా కార్మికులు అడుగుతున్నారన్నారు. పరిశ్రమ యాజమాన్యం అధికారులు పరిశ్రమకు వచ్చినప్పుడు రూ.600 వేతనం ఇస్తున్నట్లు, గుడ్డు, పాలు ఇస్తున్నట్లు చెబుతున్నారన్నారు. కనీస వేతనం రూ 600 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వేతనంతో కూడిన వారాంతరపు సెలవులు అమలు చేయాలన్నారు. పి ఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధఅతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, వడ్డి సత్యనారాయణ, కూనిరెడ్డి అప్పన్న,దారపు రెడ్డి కఅష్ణ, నీలపాల సూరిబాబు, సిరపరపు శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️