ఉపాధ్యాయులకు సన్మానం

Oct 5,2024 15:39 #respect, #Teachers

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్‌ 100 రోజుల సేవా యజ్ఞం లో భాగంగా స్థానిక లైన్స్‌ సేవా భవనం నందు పలువురు ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. మండలంలోని చంద్రాల యుపి పాఠశాలలోని పనిచేస్తున్న ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి కలపాల రత్నం ఎం ఆరోగ్యం, సిహెచ్‌ శ్రీనివాస్‌, ఎం స్రవంతి లకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయల్స్‌ క్లబ్‌ అధ్యక్షురాలు నిమ్మగడ్డ శశికళ, క్లబ్‌ సభ్యులు నవాబు, వైపీసీ ప్రసాద్‌, పరంధామయ్య, జంగం మోహనరావు, సుభ్రమణ్య్వేశ్వరరావు అడుసుమిల్లి రామమోహనరావు, బొప్పన శివప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️