ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ‘ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి – స్పందించని అధికారులు ‘ అనే శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో సోమవారం కథనం వెలువడింది. ఈ వార్తపై స్పందించిన జిల్లా అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెదురుకుప్పం ఏఈ రంగనాథం తన సిబ్బందితో కలిసి మంగళవారం పచ్చికాపల్లం పేట గ్రామంలో కేశవుల రెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తిరిగి అమర్చారు. రైతు అధికారులకు, ప్రజాశక్తికి ధన్యవాదాలు తెలియజేశారు.

➡️