ప్రజాశక్తి-సిఎస్ పురంరూరల్ : స్పందనలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆర్డీవో డి కేశవర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పందన అర్జీలు, రెవెన్యూపరంగా పెండింగ్‌లో ఉన్న అర్జీలు, సింగరాయకొండ మైదుకూరు హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాలలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపులు తదితరాల గురించి చర్చించారు. రెవెన్యూపరంగా వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డి మంజునాథరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.