ప్రజాశక్తి – ఆలమూరు : రెవిన్యూ సంబధిత సమస్యలతో పాటు అర్హులైన లబ్దిదారులు అందరికీ సంక్షేమ పథకాలను అందజేసేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు మండల ప్రత్యేక అధికారి కె.నాగేశ్వరరావు, తహసిల్దార్ కె.జె.ప్రకాష్ బాబు అన్నారు. మండలంలోని పినపళ్లలో మంగళవారం రెవెన్యూ సదస్సు సర్పంచ్ సంగిత సుభాష్, ఎంపీటీసీ పెదిరెడ్డి పట్టాభిల సమక్షంలో సంగిత లక్ష్మీకాంతం కళ్యాణ మండపంలో మంగళవారం వారు నిర్వహించారు. ఈసదస్సులో రైతుల నుండి వారు అర్జీలు స్వీకరించారు. నిర్ణీత సమయంలో దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని గ్రామస్తులకు వారు హామీ ఇచ్చారు. అలాగే సంక్షేమ పథకాల కోసం అందిన దరఖాస్తులను సంబధిత అధికారులకు నివేదించి మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ టి.రామాయమ్మ, మండల సర్వేయర్ ప్రభావతి, కార్యదర్శి వి.వేణి, విఆర్వో ఉదయ్ కుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ నాగరాజు, సర్వేయర్ ఎస్కె.మొహిద్దిన్ పాల్గొన్నారు.