సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆర్డీఒ సాయిశ్రీ అన్నారు. మండలంలోని వేల్పుచెర్ల గ్రామంలో బుధవారం తహశీల్దార్‌ వరద కిషోర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సును ఆర్డీఒ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ … సదస్సుకు ముందు రోజు రెవెన్యూ అధికారులు 1 బి అందజేశారా అని ప్రజలను ఆరా తీశారు. ఆయా గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు సదస్సులో అందుబాటులో ఉంటాయని రైతులు పరిశీలించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ రిజిస్టర్‌, ఆర్‌ఐ సుజిత్‌, సర్వేయర్‌ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️