భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

ప్రజాశక్తి- చీరాల : భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దారు గోపి కృష్ణ తెలిపారు. మండల పరిధిలోని ఈపురు పాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు మాట్లాడుతూ రైతుల భూ సమస్యలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అనంతరం రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శివ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహశీల్దారు అర్జున్‌, ఆర్‌ఐ కుమార్‌,సెక్రటరీ బాపూజీ, ఎండోమెంట్‌ మేనేజర్‌ శివ నాగదాసు , సర్వేయర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బల్లికురవ : మండల పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దారు రవి నాయక్‌ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు భూ సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులో అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటీ రవికుమార్‌, సర్పంచ్‌ కష్ణ కుమారి, శివనార్నాయణ, రైతులుపాల్గొన్నారు. సంతమాగులూరు : భూ సమస్యల పరిష్కా రానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేక అధికారి ఎం. రమేష్‌ బాబు తెలిపారు. మండల పరిధిలోని ఏల్చూరు గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌ బాబు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ, అటవీ, దేవదాయ, వక్ఫ్‌, మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. రైతులకు భూ సమస్యలు ఉంటే రెవెన్యూ సదస్సులో అర్జీ అందజేసి పరిష్కరించు కోవాలన్నారు. తోట ఆంజనేయులు స్వామి గుడికి వెళ్లే రహదారిని కొందరు ఆక్రమించి షెడ్లు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఫలితంగా గుడికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. రహదారి స్థలంలో ఆక్రమణలు తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్‌ పుస్తకాలకు ఐదు, భూ ములను సర్వే కోసం మూడు అర్జీలు అందజేసినట్లు విఆర్‌ఒ రామబ్రహ్మం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు రాఘవరావు, ఆర్‌ఐ రామారావు, ఎండోమెంట్‌ ఇఒ కష్ణారెడ్డి, రెవెన్యూ డిటీ భాస్కర్‌ రెడ్డి, విఆర్‌ఒ జ్యోతి బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️