భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామసభలు

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (కోనసీమ) : భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభలను రైతులంతా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్‌ వాసా కోటేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని అంగర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రెవిన్యూ గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రెవెన్యూ గ్రామ సభలో తహసిల్దార్‌ పి.చిన్నారావు పాల్గని మాట్లాడారు. రీ సర్వేలో పొరపాట్లను సరిదిద్దేందుకే గ్రామసభలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం భూ సమస్యలపై రైతుల నుంచి వివిధ దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వాసా కోటేశ్వరరావు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్‌, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్‌, కార్యదర్శి ఆర్‌ ఎం వి వి ఎన్‌ ఈశ్వరరావు, గ్రామ విఆర్‌ఓలు పి.సత్యనారాయణమూర్తి, గుమ్మడి సీతామహాలక్ష్మి, రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

➡️