కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష

Jun 10,2024 21:18

ప్రజాశక్తి- బొబ్బిలి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పిఎం అవార్డు సభ్యులు వైఆర్‌ సింగ్‌, ఎన్‌.కె వాధ్వ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలో ఐటిఐ కాలనీ జగనన్న లేఅవుట్‌లో పిఎం ఆవాస్‌ యోజన ఇళ్లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో లబ్ధిదారు లతో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్‌ కనెక్షన్లతో ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పొంది రూ.300 సబ్సిడీతో గ్యాస్‌ పొందుతు న్నామని లబ్ధిదారులు అవార్డు టీమ్‌ సభ్యులకు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో చేపలు పెంచుతున్నామని మత్స్యకా రులు, పాడి పశువులు కొనుగోలు చేసి పాల ఉత్పత్తిలో ఉపాధి పొందుతున్నామని పాడి రైతులు, రుణాలతో భూమిను అభివృద్ధి చేసి వ్యవసాయ పెట్టుబడులు పెట్టడంతో ప్రైవేట్‌ రుణాలు వాడాల్సిన అవసరం రాలేదని రైతులు చెప్పారు. పిఎం స్వనిది యోజన పథకంతో రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నామని మహిళలు చెప్పారు. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని రైతులు, వృత్తిదారులు కమిటీ సభ్యులను కోరారు. సమాy ేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి, జిల్లా అధికా రులు, పాల్గొన్నారు.ప్రధానమంత్రి యోజన పథకాలు పరిశీలనబొబ్బిలిరూరల్‌: మండలంలో జి.యెస్‌.ఆర్‌పురంలో పలు ప్రధానమంత్రి యోజన పథకాలను సోమవారం కేంద్ర బృందం డైరెక్టర్లు వైఎస్‌సింగ్‌, ఎన్‌.కె వాద్వ, పియం మాతృయోజన, పియం ఆరోగ్య, పియం మెషిన్‌, పియం ఇంద్ర ధనస్సు, పోషన్‌ ఆదయాన్‌ తదితర పథకాలపై ఆయా పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో ఆర్‌డిఒ ఏ.సాయిశ్రీ, ఆర్‌.డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ, తహశీల్దార్‌, ఐసిడిఎస్‌ పిఒ పాల్గొన్నారు.

➡️