తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష

ప్రజాశక్తి – నగరం : మండల పరిధిలోని ధూళిపూడిలోనున్న శ్రీ తాళమ్మ తల్లి వీరమ్మ పేరంటాల తిరునాళ్ల ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అందులో ఎస్‌ఐ బండ్ల భార్గవ్‌ సోమవారం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఇఒ లక్ష్మీప్రసన్నతో మాట్లాడి ఏర్పాట్లను గురించి ఆరా తీశారు. అనంతరం తిరునాళ్లలో భాగంగా సిడి మానోత్సవం, జంగుబిల్లి ఆవు ఊరేగింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు తిరునాళ్ల వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలపై గ్రామ పెద్దలతో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ తిరునాళ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా డ్రోన్‌ సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

➡️