ప్రజాశక్తి – సీతంపేట : రీ సర్వేను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విఆర్‌ఒలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియలో అగ్రికల్చర్ అసిస్టెంట్లకు విఆర్‌ఒలు సహకరించాలన్నారు. రీ సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. అదే విధంగా గృహ నిర్మాణాలకు సంబంధించిన ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే మంజూరు చేయాలని విఆర్‌ఒలకు సూచించారు. విఆర్‌ఒలు మంజూరు చేసిన ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ లను వెంటనే ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేసి గృహనిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఎఇకి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అప్పలరాజు, ఎంపిడిఒ గీతాంజలి, వ్యవసాయశాఖ ఎఒ శ్రీదేవి, హౌసింగ్ ఎఇ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
