రిషితేశ్వరికి న్యాయం దక్కలేదు : ఎస్‌ఎఫ్‌ఐ

Nov 30,2024 00:43

ప్రజాశక్తి-గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2015 జూలై 14వ తేదీన ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో న్యాయం జరగలేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్‌ అన్నారు. శుక్రవారం బ్రాడీపేటలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ర్యాగింగ్‌ వేధింపులు భరించలేక యూనివర్సిటీ హాస్టల్‌ గదిలో ఉరేసుకుని చనిపోయిందని, సూసైడ్‌ నోట్‌లో తన ఆత్మహత్యకు కారణం ర్యాగింగ్‌ అని, తనని సీనియర్‌ విద్యార్థులు వేధిస్తున్నారని స్పష్టంగా రాసినట్లు గుర్తు చేశారు. ఈ కేసులో ముగ్గురు విద్యార్థులు, అప్పటి ఆర్కిటెక్చర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ బాబురావు నిందితులుగా పేర్కొంటూ ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారన్నారు. తొమ్మిదేళ్ల నుండి ఈ కేసు నడుస్తోందని, ఈ కేసును కొట్టి వేస్తూ న్యాయస్థానం తీర్పునివ్వడం బాధాకరమన్నారు. రిషితేశ్వరి కేసులో నిందితులకు శిక్ష పడకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. సమావే శంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్కే సమీర్‌, నగర అధ్యక్షులు యశ్వంత్‌, సుభాని పాల్గొన్నారు.

➡️