ప్రజాశక్తి సత్తెనపల్లి రూరల్ : ఆర్ అండ్ బి రోడ్లు మరమ్మతులు వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆర్ అండ్ బి అధికారులతో సత్తెనపల్లిలోని టిడిపి ప్రజావేదికలో గురువారం సమీక్షించారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలన్నారు. ఆర్ అండ్ బి అతిథిగృహానికి రూ.1.42 కోట్లు, ముప్పాళ్ళ పిహెచ్‌సికి రూ.50 లక్షలు మంజూరయ్యాయని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. నియోజకవర్గంలో ఆర్ అండ్ బి శాఖ నుంచి మంజూరైన రూ.6.65 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులనూ త్వరగా పూర్తి చేయాలన్నారు.