ప్రజాశక్తి- అనకాపల్లి
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, అనకాపల్లి 10వ అదనపు జిల్లా జడ్జి ఎన్.శ్రీవిద్య, 12ఎంఎంకోర్టు మెజిస్ట్రేట్ బివి.విజయలక్మి, 11 ఎఎంఎం కోర్టు మెజిస్ట్రేట్ ఏ.రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి కోర్టు కాంప్లెక్స్ వద్ద ప్రారంభమైన ఆ ర్యాలీ రింగ్ రోడ్ మీదుగా, తిరిగి కోర్ట్ కాంప్లెక్స్ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన యాక్షిడెంట్ డేటా ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో 3703 కేసులలో 3042 మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలలో చనిపోయారని తెలిపారు. కేవలం హెల్మెట్ దరించకపోవడం వలన ఇంతమంది పౌరులు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రమాదాల తీవ్రత గుర్తించి ముఖ్యంగా యువత, విద్యార్దులు ద్విచక్ర వాహనంపై వెళుతున్నప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించి, సురక్షితంగా ఇంటికి చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైడపు నాయుడు, అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శంకర రావు, పట్టణ నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.