లే అవుట్‌ పూడికతో రోడ్లు ఛిద్రం

Sep 27,2024 11:51 #cracked, #laid out silt, #roads

ప్రజాశక్తి-రావులపాలెం (కోనసీమ) : మండల పరిధిలో లేఅవుట్‌ లు కారణంగా రోడ్లు ఛిద్రం అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల పరిధి పొడగట్లపల్లి శివారు లక్ష్మీపాలెంలో భారీ లోడుతో గ్రావెల్‌ రవాణా చేయడం మూలంగా రోడ్లుకు గుంతలు ఏర్పడి జనజీవనానికి అంతరాయం ఏర్పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ గ్రామం పొడగట్లపల్లి పంచాయతీ పరిధి అయినప్పటికీ జాతీయ రహదారి కొద్దిపాటి మీటర్లు దూరంలో ఉండటం మూలంగాను, రావులపాలెం దగ్గర కావడంతో లక్ష్మీపాలెం గ్రామం చుట్టూ ఉన్నపొలాలకు గిరాకీ ఏర్పడింది. ఇప్పటికే రెండు మూడు చోట్ల పంటభూములు లేఅవుట్‌ లుగా మారాయి.అయితే వీటికి అనుమతులు ఉన్నాయా లేవా అనేది ప్రక్కకు పెడితే గ్రామానికి ప్రధాన రహదారి గుంతలు ఏర్పడి రోడ్డు బురదమయంగా మారింది.దీంతో గ్రామ ప్రజలు, విద్యార్థులు,కార్మికులు, కర్షకులు తమతమ విధులకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది.అధిక లోడుతో లారీలు రవాణా జరుగుతున్న నేపథ్యంలో మంచి నీరు సరఫరా చేసే పైపులైన్‌ పగిలి త్రాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి.సంబధిత అధికారులు జనజీవనానికి అంతరాయం ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️