మహిళలపై దాడులను అరికట్టాలని గర్జన

Sep 30,2024 21:47

ప్రజాశక్తి-విజయనగరంకోట :  మహిళలపై రోజురోజుకూ పెరగుతున్న అకృత్యాలను అరికట్టాలని, మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ వాజీ ఛానల్‌, పలు స్వచ్ఛందసంస్థలు, మహిళా సంఘాల ఆధ్వర్యాన మహిళలు సోమవారం నగరంలో మహిళా గర్జన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోట వద్ద ఈ ర్యాలీని వాజీ ఛానల్‌ ఎమ్‌డి జి.శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి గురజాడ జంక్షన్‌ మీదుగా పైడితల్లమ్మ ఆలయం, మూడు లాంతర్లు, గంట స్తంభం, మహారాజా కాలేజ్‌ మీదుగా గురజాడ సెంటర్‌ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి, వాజీ ఛానల్‌ ఎమ్‌డి జి.శ్రీనివాసరావు, రోటరీ క్లబ్‌ గవర్నర్‌ డాక్టర్‌ఎం. వెంకటేశ్వరరావు, పలు మహిళా సంఘాల నాయకులు మాట్లాడారు. కుటుంబాల్లో స్రీ,్త పురుషుల మధ్య బేధం లేకుండా చూడాలన్నారు ప్రభుత్వాలు మహిళలకు ఏం జరిగినా వెంటనే స్పందించే విధంగా ప్రతి చోట నెంబర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, జన విజ్ఞాన వేదిక, మేమున్నాం స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కాపుగంటి ప్రకాష్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జి.హిమబిందు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా అధ్యక్షులు అచ్చిరెడ్డి, స్వచ్ఛంద సంస్థల సభ్యులు సూర్య లక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

➡️