ప్రజాశక్తి-తిరుమల : మంగళవారం రాత్రి నుండి కురిసిన వర్షానికి తిరుమల రెండవ ఘాట్ రోడ్లో బుధవారం ఉదయం కొండ రాళ్లు, చెట్లు జారిపడ్డాయి. రెండవ ఘాట్ రోడ్ లోని రెండవ మలుపు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు, చెట్లు విరిగిపడ్డాయి. టిటిడి ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బంది వచ్చి వాటిని తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్లను క్లియర్ చేశారు. ఘాట్ రోడ్డులో వెళ్లే యాత్రికులు టిటిడి సూచనలు పాటించాలని అధికారులు కోరారు.