ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : రొద్దం ఎంపీపీ చంద్రశేఖర్ (60) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. మండలంలోని రొద్దం గ్రామానికి చెందిన వైస్సార్సీపీ ఎంపీపీ గత సంవత్సరం నుంచి క్యాన్సర్ తో బాధపడుతూ సంవత్సరం నుంచి చికిత్స చేయించుకుని రెండు నెలల నుంచి ఇంట్లో విశ్రాంతి తీసుకొంటూ అనంతరం రెండు మూడు రోజుల క్రితం అనంతపురం లో సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఈరోజు మృతి చెందారు.