పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు బస్సులు నడపడానికి రూట్‌ సర్వే

ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలములో ఎస్‌ కోట ఆర్టీసీ డిపో నుండి పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలుకు వెళ్లే విద్యార్థులుకు బడి బస్సు సౌకర్యం లేక ఆటోలపై సకాలంలో వెళ్లలేక జాకేరు, కరకవలస, గిరిజన గ్రామాలు వెంకయ్య పాలెం, పోతు బంది పాలెం, చామలాపల్లి, దబ్బిరాజుపేట గ్రామాల పిల్లలకు పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు వేపాడ పరీక్షా కేంద్రాలకు వెళ్ళుటకు బడి బస్సు సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ కి ఈనెల 10వ తేదీన ప్రజావేదిక సమస్యల పరిష్కార విభాగంలో సామాజిక కార్యకర్తగా రిక్కి అప్పారావు వినతి పత్రం సమర్పించగా అందుకు స్పందించిన ఆర్టీసీ డిపో యాజమాన్యం బస్సు రోడ్‌ సర్వే చేయడం జరిగింది చిన్న చిన్న లోపాలు ఉన్నవి సరి చేయండి ఈ నెల 17వ తేదీ నుండి బస్సు ఏర్పాటు చేస్తామని ఎస్‌ కోట ఆర్టీసీ డిపో మేనేజర్‌ కే రమేష్‌, సూపరిండెంట్‌ వెంకట్రావు, గ్యారేజీ ఇన్చార్జి సత్యనారాయణ, సెక్యూరిటీ ఇన్చార్జి నారాయణ, సూపర్వైజర్లు ఈ రూట్‌ లో పాల్గొన్నారు.

➡️