సామాజిక సేవలో రోటరీ క్లబ్

Nov 28,2024 16:13 #Kurnool

ప్రజాశక్తి – ఆదోని:  ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు, సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో ఆదోని పట్టణంలోని సీనియర్ ఫిజీషియన్లు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ బాలాజీ, డాక్టర్ అవినాష్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ గోవిందరాజులు, డాక్టర్ శాలి జమీల్, డాక్టర్ కౌశిక్ గుప్తా సోమిశెట్టి, డాక్టర్ సైఫుల్లా పాల్గొని వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్  సామాజిక సేవలో  ముందుంటుందని సభ్యులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత గుండె, డయాబెటిస్ వ్యాధి శిబిరానికి విశేష స్పందన వచ్చిందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ సైఫుల్లా తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరంలో 157 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వైద్య పరీక్షలో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు, హిమోగ్లోబిన్, క్రియాటిన్, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్, కంటి పరీక్షలు, దంత వైద్య పరీక్షలు, థైరాయిడ్, షుగర్, ఈసీజీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఉద్యోగంలో భాగంగా ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు వృత్తిలో ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమాదాల బారిన పడి మృతిచెందిన సంఘటనలను గుర్తించి ఆర్టీసీ కార్మికుల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు  నిర్వహించినట్లు వారు తెలిపారు.  పరీక్షల ద్వారా  వారి ఆరోగ్య సమస్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడం  జరిగిందన్నారు. వైద్య శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేసుకున్న కార్మికులు రోటరీ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడుతామని వారు తెలిపారు. అంతకుముందు ఆదోని ఆర్టీసీ ఇన్చార్జి డిపో మేనేజర్ అమర్నాథ్, అసిస్టెంట్ ఇంజనీర్ వేణుగోపాల్, కార్మిక సంఘం నాయకులు హరిబాబు శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు ప్రశాంత్ గాంధీ, సునీల్ రెడ్డి, జీవన్ సింగ్, భరత్ షా, రాజేష్ జైన్, ఇతేష్, వికాస్ జైన్, హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.

➡️