రూ.25 లక్షల పురుగు మందులు స్వాధీనం

Oct 4,2024 00:27

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పల్నాడు జిల్లా గురజాల మండలం గోగులపాడులో ఎరువులు, పురుగు మందుల షాపుల్లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు గురువారం తనిఖీలు చేశారు. రూ.72,689 విలువగల పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. 14 లీటర్ల కాలం చెల్లిన పురుగు మందులను గుర్తించారు. నిషేధిత కలుపు మందు ఆరు కిలోలను గుర్తించి రూ.10,800 విలువైన మందును, నిబంధనలకు విరుద్ధంగా విక్రయించేందుకు నిల్వ చేసిన రూ.24.20 లక్షల విలువైన 470 లీటర్ల పురుగు మందులను స్వాధీనం చేసుకు న్నారు. తనిఖీల్లో విజిలెన్సు వ్యవసాయ అధికారి కె.రమణ కుమార్‌, సిఐ కె.చంద్రశేఖర్‌, స్థానిక వ్యవసాయాధికారి సంధ్యారాణి పాల్గొన్నారు.

➡️