వరద బాధితులకు రూ.50 వేలు అందజేత

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌: వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ మార్కాపురం పట్టణానికి చెందిన జర్నలిస్టులు అండగా నిలిచారు. మార్కాపురం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విలేకరుల నుండి సేకరించిన రూ.50 వేలు విరాళంగా అందజేశారు. సోమవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు డి.మోహన్‌ రెడ్డి, వి.వెంకటేశ్వరరెడ్డి, గౌరవాధ్యక్షులు కె.రామకష్ణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్‌వి రమణ, జర్నలిస్టులు ఎం.అల్లూరిరెడ్డి, పి.ఓబయ్య, టి.నారాయణరెడ్డి, బాషా, నరేంద్ర, శేఖర్‌, నాగార్జున, కె.శ్రీనివాసులు, రాజ్‌ కమల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️